శిల్పా కాలనీవాసుల కన్నీటి కష్టాలు

మేడ్చల్: ప్రగతినగర్‌కు కూత వేటు దూరంలో ఉన్న శిల్పా కాలనీవాసుల కష్టాలు అన్ని ఇన్ని కావు. రోడ్ల పరిస్థితి దమనీయంగా ఉండి వర్షాకాలంలో వాహనాలపై నుండి జారిపడుతూ మహిళలు గాయాల పాలవుతున్నారు. తాగునీటి కోసం నీళ్ల ట్యాంకులపై ఆధారపడక తప్పటం లేదు. డ్రైనేజీ సిస్టం లేక మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తూ జనం నడవలేని పరిస్థితి ఏర్పడింది. శనివారం కాలనీవాసులందరూ రోడ్లపై చేరి తమ నిరసన తెలిపారు.