బొబ్బిలిపేటలో కురిసిన వడగండ్ల వాన
SKLM: ఆమదాలవలస మండలం బొబ్బిలిపేట గ్రామంలో గురువారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. సాయంత్రం వేళ ఒక్కసారిగా ఆకాశం మేఘమృతంగా మారి ఈ వాన కురవడంతో ఎండ తీవ్రత నుండి ఉపశమనం కలిగింది. దీని వలన పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఒక్కసారిగా వర్షం కురవడంతో ఆరుబయట ఎండబెట్టిన ధాన్యం తడిచాయని రైతులు తెలిపారు.