VIDEO: 'రేపు ఈ అంశంపై గట్టిగా మాట్లాడతాం'
HYD: డివిజన్ల సరిహద్దులలో కూడా పారదర్శకత లేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వారు మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలను, ప్రజాప్రతినిధులను సంప్రదించకుండా, ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా ఆఫీసుల్లో కూర్చొని డివిజన్లను ఏర్పాటు చేశారన్నారు. రేపు జరిగే కౌన్సిల్ సమావేశంలో ఈ అంశంపై గట్టిగా మాట్లాడతామన్నారు.