VIDEO: VDCC టెక్నాలజీ రోడ్లు అంటే ఏంటి..?
HYDలో ప్రస్తుతం VDCC రోడ్లు నిర్మిస్తున్నారు. అసలు VDCC అంటే ఏంటో తెలుసా..? వాక్యూమ్ డీవాటరింగ్ సిమెంట్ కాంక్రీటు రోడ్లు అని అర్థం. అత్యధిక నాణ్యత, మన్నికైన రోడ్ల నిర్మాణం కోసం VDCC టెక్నాలజీలో ప్రత్యేక యంత్రం ద్వారా సిమెంట్ కాంక్రీట్‌లో వాటర్ కంటెంట్ తగ్గించేస్తారు. క్యూరింగ్ సైతం అంతగా చేయాల్సిన పని ఉండదని అధికారులు తెలిపారు.