కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ప్రభుత్వ విప్
MHBD: జిల్లా దంతాలపల్లి, నర్సింహులపేట మండలాల్లో ప్రభుత్వవిప్, డోర్నకల్ ఎమ్మెల్యే డా. రాంచందర్ నాయక్ శనివారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా మండలాల్లో ఏర్పాటు చేసిన పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతు సంక్షేమ ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని, రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగ పరుచుకోవాలని ఆయన కోరారు.