ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

SRPT: భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోదాడ 23వ వార్డులో వార్డు ఇన్‌ఛార్జ్ కోరుగంటి పురుషోత్తం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రావు హాజరయ్యారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.