VIDEO: పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరిన వాహనదారులు

VIDEO: పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరిన వాహనదారులు

NRML: బుధవారం నిర్మల్ పట్టణంలోని పెట్రోల్ బంక్‌ల వద్ద వాహనదారులు భారీగాచేరడంతో పొడవైన క్యూలు కనిపించాయి. ఇంధన కొరత వదంతుల ప్రచారంతో ప్రజలు ముందుగానే పెట్రోల్, డీజిల్ నింపించుకునేందుకు బంక్‌లకు చేరుకున్నారు. దీంతో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు ప్రజలు ఆందోళన చెందవద్దని, ఇంధన సరఫరా సాధారణంగానే కొనసాగుతుందని తెలిపారు.