చేపల తరలింపుపై గ్రామస్తుల ఆగ్రహం

చేపల తరలింపుపై గ్రామస్తుల ఆగ్రహం

SRPT: ఆత్మకూరు (ఎస్) మండలంలోని ఏపూర్, నసీంపేటల్లో చేపల లోడును గ్రామస్తులు అడ్డుకున్నారు. స్థానికులకు విక్రయించకుండా కాంట్రాక్టర్ బయటికి తరలించడాన్ని నిరసించారు. సాగునీరు విడుదల చేయకుండా చెరువును నిలిపి ఉంచి, ఒప్పందాన్ని ఉల్లంఘించడంపై మండిపడ్డారు. వారం రోజుల్లో గ్రామస్తులకు చేపలు ఇస్తామన్న కాంట్రాక్టర్ హామీతో నిరసన విరమించారు.