చెక్ పోస్ట్‌ను తనిఖీ చేసిన డిఎస్పి

చెక్ పోస్ట్‌ను తనిఖీ చేసిన డిఎస్పి

SRCL: బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సింగపూర్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్‌ను సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహన తనిఖీలు, రిజిస్టర్ పరిశీలనతో పాటు, సిబ్బంది పనితీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అక్రమ నగదు, మద్యం రవాణాను అరికట్టాలని, ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బులు, మద్యం, తరలిస్తే సమాచారం ఇవ్వాలన్నారు.