ఘనంగా స్వామివారి నిత్యకళ్యాణం

ఘనంగా స్వామివారి నిత్యకళ్యాణం

BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో శుక్రవారం నిత్యకళ్యాణం భక్తిశ్రద్ధలతో జరిగింది. అర్చకులు శ్రీ సీతారాములను పుష్పమాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కల్యాణ మహోత్సవం కనుల పండువగా సాగి, అధిక సంఖ్యలో హాజరైన భక్తులు దివ్య దంపతుల ఆశీస్సులు పొందారు. ఆలయ ప్రాంగణం ‘జై శ్రీరామ్’ నినాదాలతో మార్మోగింది.