ఏలూరులో మహిళ మృతదేహం లభ్యం

ఏలూరులో మహిళ మృతదేహం లభ్యం

ఏలూరు నగరంలోని 3 టౌన్ పరిధిలో క్రాంతి కళ్యాణ్ మండపం సమీపంలో ఉన్న కాళీ ప్లాట్లలో ఓ మహిళ మృతదేహం కలకలం రేపింది. మహిళ శరీరం పూర్తిగా కుళ్లిన స్థితిలో ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఆమె వయసు 40 - 50 ఏళ్ల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.