‘రైతులకు తప్పని సాగునీటి కష్టాలు’
VZM: నరసన్నపేట మండలంలో వంశధార కాలువల ద్వారా నీరు వచ్చినా రైతులకు అందడం లేదు. కోమర్తి ఛానల్‌లో బొడ్డవానిపేట వద్ద షట్టర్లు పాడవడంతో నీరు క్రిందకు పోతుందని రైతులు మంగళవారం తెలిపారు. సాగునీరు నిలుపుదల కోసం ఇసుకమూటలు వేసి మరమ్మతులు చేస్తూ రైతులు ఇబ్బందులు పడుతున్నారు.