'కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలి'

'కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలి'

NGKL కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవికి మద్దతుగా తలకొండపల్లి మండలంలో స్థానిక కాంగ్రెస్ నేతలు మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మండలంలోని పడకల్, వెంకటాపూర్, పెద్దూరు తాండ తదితర గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ అండగా నిలవాలని కోరారు.