సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
NLR: వింజమూరు టీడీపీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం సీఎం సహాయనిధి ద్వారా మొత్తం 74 మంది లబ్ధిదారులకు సుమారు రూ. 65 లక్షల ఆర్థిక సహాయాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు చంద్రబాబు అందిస్తున్న ఈ సహాయం ఎంతోమందికి జీవనాధారంగా నిలుస్తుందని తెలిపారు.