గర్భిణులకు అండగా ‘అమ్మకు భరోసా’

గర్భిణులకు అండగా ‘అమ్మకు భరోసా’

నెల్లూరు జిల్లాలో గర్భిణుల రక్తహీనత నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తీవ్ర రక్తహీనతతో బాధపడే వారికి రూ.1500 విలువైన FCM (ఫెర్రిక్ కార్బాక్సీ మాల్టోజ్) ఇంజెక్షన్లను ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అందిస్తున్నారు. జీజీహెచ్, సీహెచ్‌సీల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. గర్భిణులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.