7,652 బ్యాగుల యూరియా బుకింగ్‌కు సిద్ధం

7,652 బ్యాగుల యూరియా బుకింగ్‌కు సిద్ధం

MBNR: జిల్లా కేంద్రంలోని డీసీఎంఎస్ ఎరువుల గోదామును జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా గురువారం సందర్శించారు. యూరియా కోసం యాప్ లో బుక్ చేసుకున్న రైతులకు మాత్రమే యూరియా ఇవ్వాలని ఆదేశించారు. ఈ పాస్‌లో విక్రయాలకు నిల్వలకు ఎటువంటి తేడా ఉండకూడదని హెచ్చరించారు. 7,652 బ్యాగుల యూరియా నిలువలు ఉన్నాయని ఎటువంటి యూరియా కొరత లేదని కలెక్టర్‌కు అధికారులు వివరించారు.