విశాఖలో ప్రైవేటు బస్సుల తనిఖీ
VSP: కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో విశాఖ రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రైవేటు బస్సులను పరిశీలించారు. నిబంధనలు పాటించని కొన్ని ప్రైవేట్ బస్సులను తనిఖీల్లో భాగంగా ఆదివారం సీజ్ చేశారు. విశాఖ నుంచి బయలుదేరే చాలా ప్రైవేటు బస్సులు నిబంధనలు పాటించడం లేదని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఈ దాడులు కొనసాగుతాయని అధికారులు స్పష‍్టం చేశారు.