లంబాడ హక్కుల పోరాట సమితి నాయకుల ముందస్తు అరెస్ట్
ADB: గిరిజనుల హక్కులను పరిరక్షించాలని డిమాండ్‌తో బుధవారం అసెంబ్లీ ముట్టడికి పిలుపు ఇచ్చిన లంబాడ హక్కుల పోరాట సమితి నాయకులను ఉట్నూర్‌లో పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ చౌహన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నిరసన తెలిపే హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు.