3 రన్స్ చేస్తే విజయం.. అంతలో మ్యాచ్ రద్దు

3 రన్స్ చేస్తే విజయం.. అంతలో మ్యాచ్ రద్దు

మహిళల బిగ్‌బాష్ లీగ్(ఆస్ట్రేలియ)లో అనూహ్య ఘటన జరిగింది. అడిలైడ్ స్ట్రైకర్స్ vs సిడ్నీ థండర్స్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు ఓవర్లు కుదించారు. ఈ క్రమంలో ముందుగా స్ట్రైకర్స్ నిర్ణీత 5 ఓవర్లకు 45/2 చేసింది. లక్ష్యఛేదనలో థండర్స్ 2.5 ఓవర్లలోనే 43 రన్స్ చేసింది. విజయానికి 3 రన్స్ దూరంలో ఉండగా మరోసారి వర్షం పడటంతో అంపైర్లు మ్యాచ్ రద్దు చేశారు.