ఉండవల్లి కరకట్ట వద్ద ఉద్రిక్తత

ఉండవల్లి కరకట్ట వద్ద ఉద్రిక్తత

AP: సీఎం చంద్రబాబు నివాసం ముట్టడికి ఫైబర్ నెట్ ఆపరేటర్లు పిలుపునివ్వడంతో ఉండవల్లి కరకట్ట వద్ద ఉద్రిక్తత నెలకొంది. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారీగా ఆపరేటర్లు తరలివచ్చారు. ప్రభుత్వం స్పందించకపోతే టీడీపీ కార్యాలయం వద్ద కుటుంబాలతో సహా ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. పోలీసులు భారీగా మొహరించి ఆపరేటర్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.