వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే

వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే

KMR: బాన్సువాడలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో ఇవాళ జిల్లా స్థాయి సీనియర్స్ మహిళల, పురుషుల 2025 వాలీబాల్ టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల వాలీబాల్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మహమ్మద్ గౌస్ వాలీబాల్ ట్రోఫీకి స్పాన్సర్‌గా వ్యవహరించారు.