చర్లపల్లిలో ఖైదీల వ్యవసాయ క్షేత్రం

చర్లపల్లిలో ఖైదీల వ్యవసాయ క్షేత్రం

మేడ్చల్: చర్లపల్లిలోని ఖైదీల వ్యవసాయ క్షేత్రం మన్ననలు పొందుతుంది. ఖైదీలతో వ్యవసాయం, కూరగాయల సాగు, కోళ్ల పెంపకం, నర్సరీ, మరోవైపు తేనెటీగల పెంపకం ఇలా అనేకం చేయిస్తున్నారు. ఇది ఎంతో స్ఫూర్తిదాయకమని పలువురు ఉన్నతాధికారులు సైతం అభినందించారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఖైదీలు పండించిన తాజా కూరగాయలను విక్రయిస్తారు.