నేడు భూత్పూర్‌లో ఎమ్మెల్యే పర్యటన

MBNR: దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శుక్రవారం భూత్పూర్‌లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు మెయిన్ రోడ్డు నుంచి చల్వతాండ, కర్వెన గ్రామాలకు వెళ్లే బీటీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేయనున్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో స్వయం ఉపాధి కల్పనకు సంబంధించిన పలువురికి మంజూరు పత్రాలను పంపిణీ చేయనున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలిపారు.