అన్ని వయసుల వారు ఆరోగ్యం పై దృష్టి పెట్టాలి: ఎమ్మెల్యే
RR: చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన లారా ఫిట్నెస్ క్లబ్‌ను ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రారంభించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని, అన్ని వయసుల వారు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆధునిక జీవన శైలిలో ఫిట్నెస్ ఎంతో అవసరం అన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల, శంకర్ పల్లి మున్సిపల్ ఛైర్మన్‌లు దేవర సమతా వెంకట్ రెడ్డి, సాత ప్రవీణ్ కుమార్, నాయకులు పాల్గొన్నారు.