ఒంటి గంటకు అమరావతిపై చర్చ

ఒంటి గంటకు అమరావతిపై చర్చ

AP: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను టీడీపీ ఎంపీలు కలిసి, అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై 12 గంటలకే చర్చ చేపట్టాలని కోరారు. అయితే.. అప్పుడు 'జన విశ్వాస్ బిల్లు' ఉన్నందున, ఒంటి గంట తర్వాతే దీనిపై చర్చకు అనుమతిస్తామని స్పీకర్ స్పష్టం చేశారు. దీనిపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో మాట్లాడాలని ఆయన సూచించడంతో, ఎంపీలు వెంటనే గోయల్ ఛాంబర్‌కు వెళ్లి ఆయనను కలిశారు.