'ఆటో డ్రైవర్ల రెండో మహాసభను జయప్రదం చేయండి'

TPT: జిల్లా ఆటో డ్రైవర్ యూనియన్ రెండో మహాసభను జయప్రదం చేయాలని CITU అధ్వర్యంలో ఆదివారం కరపత్రాలు విడుదల చేశారు. ఈ మేరకు ఆటో కార్మికుల తిరుపతి జిల్లా రెండో మహాసభ ఈనెల 19వ తేదీన వేమన విజ్ఞాన కేంద్రంలో జరుగనుంది. కాగా, CITU జిల్లా కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ.. పుత్తూరు పరిధిలోని ఆటో కార్మికులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.