'ఐదుగురు పేకాట రాయుళ్ళు అరెస్టు'

'ఐదుగురు పేకాట రాయుళ్ళు అరెస్టు'

VKB: బషీరాబాద్ మండల కేంద్రంలోని ఓ రైతు పొలంలో పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై నుమన్ అలీ తన సిబ్బందితో దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు పేకాట ఆడుతుండగా అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. వారి నుంచి పేకాట ముక్కలు, నగదు స్వాధీనం చేసుకొని, ఐదుగురిపై కేసు నమోదు చేశామని వెల్లడించారు.