జిల్లాలో అంతర్ కళాశాలల బ్యాడ్మింటన్ పోటీలు
KDP: YVU ఆధ్వర్యంలో ఈనెల 19వ తేదీన అంతర్ కళాశాలల బ్యాడ్మింటన్ పోటీలు జరగనున్నాయి. బద్వేలు బిజివేముల వీరారెడ్డి డిగ్రీ కాలేజీలో ఈ పోటీలు నిర్వహిస్తారు. పురుషులు, మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో పోటీలు ఉంటాయని YVU స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ కె. రామసుబ్బారెడ్డి తెలిపారు. క్రీడాకారులు అనుబంధ కళాశాలల్లో చదివి,17 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలన్నారు.