బాధిత కుటుంబానికి అండగా నిలిచిన చిన్ననాటి స్నేహితులు

బాధిత కుటుంబానికి అండగా నిలిచిన చిన్ననాటి స్నేహితులు

MDK: రామాయంపేట పట్టణానికి చెందిన సామల శ్రీశైలం లోన్ యాప్ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. వారి కుటుంబానికి తోటి స్నేహితులు అండగా నిలిచారు. 2005 సంవత్సరంలో పదవ తరగతి చదివిన తోటి విద్యార్థులు తమ స్నేహితుడి కుటుంబానికి 30 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసి అండగా నిలిచారు. శ్రీశైలం కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.