అన్న క్యాంటీన్లో ఆకస్మిక తనిఖీ

KDP: అన్న క్యాంటీన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి అన్నారు. బద్వేల్‌లోని అన్న క్యాంటీన్‌లోని ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ అల్పాహారం తింటున్న వారితో ఆయన మాట్లాడారు. అల్పాహారం నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. అన్న క్యాంటీన్‌లో రికార్డులను ఆయన పరిశీలించారు.