ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు: ఎమ్మెల్యే

ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు: ఎమ్మెల్యే

E.G: దేవరపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన భవన నిర్మాణానికి గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గురువారం శంకుస్థాపన చేశారు. మండల ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో రూ.1 కోటి నిధులతో ఆసుపత్రి నూతన భవనానికి శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. ఆసుపత్రి అభివృద్ధితో ప్రాంత ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.