ప్రాణం తీసిన అక్రమ సంబంధం
MDK: వెల్దుర్తి మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన దాసరి నర్సమ్మ(42) హత్య ఘటనలో నిందితుడు దార మల్లేష్(35) అరెస్టు చేసినట్లు డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు. నరసమ్మతో మల్లేష్ అక్రమ సంబంధం కొనసాగించడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలిపారు. దీంతో బుధవారం నరసమ్మను గొంతు నిలిమి హత్య చేయగా, శుక్రవారం సాయంత్రం గుర్తించినట్టు తెలిపారు.