మైసమ్మ ఆలయంలో మాజీ ఎమ్మెల్యే పూజలు!
VKB: వికారాబాద్ పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో గల మైసమ్మ ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే డా. మెతుకు ఆనంద్ పాల్గొన్నారు. కౌన్సిలర్ ఆర్.జగదీశ్వరీ మల్లేశం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. పట్టణ అధ్యక్షుడు గోపాల్, నాయకుడు లింగం తదితరులు పాల్గొన్నారు.