భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త
NDL: బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో ఇవాళ గొల్ల వెంకట లక్ష్మమ్మ అనే వివాహిత దారుణ హత్యకు గురైంది. ఆమెపై తన భర్త అనుమానం పెంచుకుని తరచూ గొడవ పడుతుండేవాడు. అనుమానంతో భర్త తన భార్యపై రోకలి బండతో దాడి చేయగా ఆమె అక్కడికక్కడే మృతి చెందింనట్లు పోలీసులు తెలిపారు. మృతికి గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.