అభివృద్ధి చేస్తే ఉత్తరాంధ్రకే తలమానికం

అభివృద్ధి చేస్తే ఉత్తరాంధ్రకే తలమానికం

PPM: పాచిపెంట మండలంలో ఉన్న పారమ్మకొండను పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ఉత్తరాంధ్రకే తలమానికం కాగలదు. 4000 అడుగుల ఎత్తులో శిఖరాగ్రంపై చక్కటి గుడి నిర్మించారు. కొండ మధ్యలో పాండవుల గుహ వద్ద పంచ పాండవులతో పాటు శివపార్వతుల విగ్రహాలు ప్రతిష్టించారు. శ్రీ చక్రం, భువనేశ్వరిదేవి ఆలయాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని కూడా పర్యాటక కేంద్రంగా అబివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.