అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
సత్యసాయి: MLA కందికుంట వెంకట ప్రసాద్ సోమవారం ధనియాన్ చెరువు గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్‌వాడీ కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన చిన్నారులకు బాలామృతం ప్యాకెట్‌లను పంపిణీ చేశారు. ఈ కేంద్రం ద్వారా పిల్లలకు, గర్భిణీలకు మెరుగైన పౌష్టికాహారం అందుతుందని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.