అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసిన అధికారులు
MLG: ఏటూరునాగారంలోని ఆకులవారి ఘనపురం రెవెన్యూ శివారులో రాళ్లకుంట చెరువు శిఖం భూమిపై అక్రమంగా నిర్మించిన ఓ ఇంటిని రెవెన్యూ అధికారులు కూలగొట్టారు. తహసీల్దార్ జగదీశ్వర్ ఆదేశాల మేరకు ఆర్ఐ కిరణ్,కార్యాలయ సిబ్బంది చర్యలు చేపట్టి ఆక్రమణలను తొలగించారు. ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించుకోవద్దని అధికారులు హెచ్చరించారు.