ఓపెన్ ఇంటర్ పరీక్ష కేంద్రాల తనిఖీ
NLR: ఆత్మకూరులో జరుగుతున్న ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను స్క్వాడ్ అధికారులు సోమవారం తనిఖీ నిర్వహించారు. కావలి డిప్యూటీ డీఈవో హరిప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఆత్మకూరులో నిర్వహిస్తున్న ఐదు పరీక్ష కేంద్రాలను తనిఖీ నిర్వహించారు. ఈ కేంద్రాలలో జరుగుతున్న పరీక్షల తీరును పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.