రోడ్డు ప్రమాదం.. విద్యార్థికి తీవ్ర గాయాలు
KDP: మైదుకూరు మండలం జీవి సత్రం వద్ద ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాల బస్సును వెనుక నుంచి సిమెంట్ లారీ వేగంగా ఢీకొట్టి, అదుపుతప్పి మరో కారును కూడా ఢీకొట్టింది. ఈ ఘటనలో విద్యార్థి హేమంత్, బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను మైదుకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.