రేపు ఢిల్లీకి మంత్రి లోకేష్

రేపు ఢిల్లీకి మంత్రి లోకేష్

AP: మంత్రి నారా లోకేష్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనుండడంతో ఢిల్లీలో టీడీపీ ఎంపీలను ఆయన సమన్వయం చేయనున్నారు. ఇండియా టుడే కాంక్లేవ్‌లో పాల్గొనడానికి లోకేష్ ఇవాళ కోయంబత్తూరు వెళ్లనున్నారు. అనంతరం అక్కడి నుంచి ఢిల్లీ చేరుకోనున్నారు.