కూచిపూడిలో ఆర్టీసీ బస్సు అడ్డగింత

కూచిపూడిలో ఆర్టీసీ బస్సు అడ్డగింత

ELR: తమ గ్రామంలో ఆర్టీసీ బస్సులు ఆపడం లేదంటూ పెదవేగి మండలం కూచిపూడిలో గ్రామస్థులు, విద్యార్థులు ఇవాళ ఆందోళన చేపట్టారు. ఏలూరు నుంచి రంగాపురం వెళ్తున్న బస్సును అడ్డుకుని నిరసన తెలిపారు. బస్సులు నిలపకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే అధికారులు స్పందించి తమ గ్రామంలో బస్సులు ఆగేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.