ఇళ్ల బిల్లులకు లంచం డిమాండ్.. స్పందించిన కలెక్టర్

ఇళ్ల బిల్లులకు లంచం డిమాండ్.. స్పందించిన కలెక్టర్

SRPT: పాలకీడు మండలం జాన్‌పహడ్ పంచాయతీలో ఇండిరమ్మ ఇళ్ల బిల్లుల పేరుతో లబ్ధిదారుల నుంచి రూ. 20-30 వేల వరకు డిమాండ్ చేసినట్లు పంచాయతీ కార్యదర్శి వెంకయ్యపై ఆరోపణలు వచ్చాయి. సమాచారం తెలుసుకున్న కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ దీనిపై స్పందించారు. విచారణకు ఆదేశించి, వెంకయ్యను అటాచ్ చేస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.