చైతూకి కెరీర్ హిట్ ఇస్తా: దర్శకుడు
'వృషకర్మ' ఈవెంట్‌లో దర్శకుడు కార్తీక్ దండు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు సినిమాపై ఇష్టం కలగడానికి కింగ్ నాగార్జునే కారణమని, ఆయనే తన మొదటి హీరో అని తెలిపాడు. ఇప్పుడు ఆయన తనయుడు నాగచైతన్యతో సినిమా చేయడం తన అదృష్టమని పేర్కొన్నాడు. చైతన్య కెరీర్‌లోనే ది బెస్ట్ సినిమా ఇస్తానని, ఈ చిత్రం భారీ స్థాయిలో ఉండబోతోందని ఎంతో ధీమాగా వ్యక్తం చేశాడు.