'అనుమతులు లేని స్విమ్మింగ్ పూల్స్‌పై చర్యలు తీసుకోండి'
MDCL: అల్వాల్ సర్కిల్ పరిధిలో అనుమతులు లేకుండా నడుస్తున్న స్విమ్మింగ్ పూల్స్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస భద్రతా ప్రమాణాలు, శిక్షణ పొందిన ట్రైనర్లు, రక్షణ కంచెలు లేకుండానే పూల్స్ నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. జీహెచ్ఎంసీ అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదన్నారు.