VIDEO: 'క్యాన్సర్ మహమ్మారిని తరిమికొట్టాలి'
E.G: క్యాన్సర్ మహమ్మారిని కలిసికట్టుగా తరిమికొట్టాలని తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ కోరారు. శనివారం అత్తిలి మండలం కొమ్మరలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. శిరగాని నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు అత్తిలి మండలంలో శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. మొదటి దశలోనే క్యాన్సర్ గుర్తించాలని సూచించారు.