బస్సు షెల్టర్ కూల్చివేత.. గ్రామంలో టెన్షన్

బస్సు షెల్టర్ కూల్చివేత.. గ్రామంలో టెన్షన్

ఏలూరు: ఆగిరిపల్లి మండలం అడవినెక్కలంలో బస్సు షెల్టర్ కూల్చివేసిన సంఘటన గ్రామంలో శుక్రవారం సాయంత్రం చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ పార్టీకి చెందిన నాయకులే బస్సు షెల్టర్ కూల్చినట్లు స్థానికులు తెలియజేస్తున్నారు. గ్రామంలోని టీడీపీ పార్టీలో వర్గ విభేదాలతో షెల్టర్ కూల్చారని అనుమానిస్తున్నారు.