పాలపిట్ట దర్శనం కోసం వేచి చూస్తున్న ప్రజలు
WGL: దసరా పండుగ వేళ పాలపిట్ట దర్శనం కోసం వరంగల్ ప్రజలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రతి సంవత్సరం దసరా సందర్భంలో పాలపిట్ట కనువిందు శుభసూచకంగా భావించే సంప్రదాయం కొనసాగుతోంది. ప్రజలు ఉదయాన్నే దేవాలయాల వద్ద, చెట్లు, పొలాల అంచుల్లో పాలపిట్ట కనిపిస్తుందేమోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాలపిట్ట దర్శనం లభిస్తే శుభమని,పెద్దల నమ్మకం.