ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు
ATP: విశ్వకర్మ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం సంతోషంగా ఉందని ఏపీ పద్మశాలి సంక్షేమ & అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పోతుల లక్ష్మీనరసింహులు పేర్కొన్నారు. శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకలు అనంతపురం నగరం పాతూరు శ్రీ విశ్వకర్మ కళ్యాణ మండపంలో ఘనంగా జరిగాయి. ఇందుకు సహకరించిన కూటమి ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు.