నేటి ఇంటర్ పరీక్షలకు 215 మంది గైర్హాజరు
ATP: జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సర బోటనీ, హిస్టరీ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. జనరల్ విభాగంలో 945 మందికి 861 మంది హాజరుకాగా, 84 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 2,255 మందికి 2,124 మంది హాజరుకాగా, 131 మంది పరీక్షకు రాలేదని పర్యవేక్షణాధికారి ఎం.వెంకటరమణ నాయక్ తెలిపారు.