పేద చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం నింపిన స్వేచ్ఛసాయి సంస్కార్
BDK: పాల్వంచ సాయి సంస్కార్ ఫౌండేషన్, సుదర్శన ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఇవాళ 50 మంది పేద, సెమీ-ఆనాథ పిల్లలకు స్పోర్ట్స్ టీ-షర్ట్స్, ట్రాక్ ప్యాంట్లు, షూస్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సతీష్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ.. ఇది కేవలం వస్తువుల పంపిణీ మాత్రమే కాదు, ఆ చిన్నారుల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడానికి చేసిన గొప్ప ప్రయత్నం అన్నారు.